సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ భద్రాచలం సీతారాములును దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అర గంటపాటు స్వామిసేవలో ఉన్నాడు. ఆ తర్వాత ఆలయం మొత్తం తిరిగి చూశారు. స్వామి విశిష్ఠత వివరించారు పండితులు. ఇటీవల విడుదల అయిన జైలవకుశ మూవీలో రామాయణంలోని పాత్రలతో తన క్యారెక్టర్లకు పేరు పెట్టారు. ఆ సమయంలో భద్రాచలం వస్తానని ఎన్టీఆర్ మొక్కుకున్నారు. సినిమా విడుదల కావటం.. ఘన విజయం సాధించటంతో భార్యతో కలిసి వచ్చిన స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఎన్టీఆర్ ఫ్యామిలీ వెంట డైరెక్టర్ కొరటాల శివ కూడా ఉన్నారు.ఎన్టీఆర్ భద్రాచలం వస్తున్నారన్న వార్తతో అభిమానులు, స్థానికులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఎన్టీఆర్ ను చూసేందుకు పోటీపడ్డారు. ఆలయం నుంచి బయటకు వస్తూ అందరికీ అభివాదం చేసారు
