తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు గత కొద్ది రోజులుగా జరుగుతున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టుల మీద చర్చ జరుగుతుంది .దీనిపై మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ చనాక – కోరటా బ్యారేజీ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా బోథ్, ఆదిలాబాద్ రూరల్ మండలలాకు సాగునీరు అందిస్తామని చెప్పారు. 2018లోపు ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చాలెంజ్‌గా తీసుకున్నామని ఆయన తెలిపారు. లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టును గత ప్రభుత్వాలు ఓట్ల కోసం వాడుకున్నాయని ఆయన ధ్వజమెత్తారు. స్వయంగా తానే 7సార్లు మహారాష్ట్రకు వెళ్లి.. ప్రాజెక్టు పనులపై చర్చించి అనుమతులు తీసుకున్నామని మంత్రి హరీష్‌రావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో ఈ ప్రాజెక్టు కోసం అనేకసార్లు పోరాటం చేశామన్న మంత్రి.. ఇప్పుడు తన నేతృత్వంలో ప్రాజెక్టు పనులు కొనసాగుతుండటం అదృష్టంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు.