కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. తుగ్గలి మండలం రామలింగాయపల్లి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గంగరాజు(27), అతని భార్య తిమ్మక్క(22) తమ కుమారుడు క్రిష్ణయ్య(8 నెలలు)తో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం ఉదయం కంది పంటకు పురుగుల మందు పిచికారీ చేసేందుకు వారు గంగరాజు, తిమ్మక్క.. కుమారుడిని తీసుకుని పొలానికి వెళ్లారు. గురువారం ఎంత రాత్రైనా వారు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లి చూశారు. అక్కడ వారు కనిపించకపోవడంతో సమీపంలోని బావి దగ్గరకు వెళ్లగా అక్కడ చెప్పులు కన్పించాయి. దీంతో గ్రామస్థుల సాయంతో రాత్రంతా మూడు ఇంజన్ల ద్వారా బావిలోని నీటిని బయటకు తోడేశారు. శుక్రవారం తెల్లవారుజామున 6 గంటల సమయంలో ముగ్గురి మృతదేహాలను వెలికి తీశారు. జొన్నగిరి ఎస్సై నజీర్ అహ్మద్, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. మృతికి కారణాలు కుటుంబ కలహాలు అని సమచారం. పూర్తి వివిరాలు తెలియాల్సింది.
