తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి మరల వలసల పర్వం మొదలైంది .అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన యువనేత ,ఎమ్మెల్యే ఒకరు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి త్వరలోనే అధికార టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవడానికి సిద్ధమవుతున్నారు అని వార్తలు వస్తున్నాయి .ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో కాంగ్రెస్ శాసనసభ పక్షం పనితీరు పట్ల ,బయట తన పట్ల వ్యవహరిస్తున్న తీరుకు తీవ్ర మనస్థాపం చెందిన ఆలంపూర్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే సంపత్ కుమార్ త్వరలోనే గులాబీ గూటికి చేరనున్నారు అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి .
కార్యకర్త స్థాయి నుండి ఎదిగివచ్చిన తనకు ఇంత అవమానాన్ని కల్గిస్తున్న పార్టీ నాయకుల తీరుపట్ల ఎమ్మెల్యే సంపత్ తీవ్ర కలత చెందారు .అంతే కాకుండా జిల్లాలో మాజీ మంత్రి ,ఎమ్మెల్యే అయిన డీకే అరుణ తో ఉన్న విభేదాలు ,సొంత నియోజక వర్గంలో నేతలతో తలెత్తున్న ఇబ్బందులు వలన ఈ నిర్ణయానికి వచ్చారు అని సమాచారం .
అంతే కాకుండా గత మూడున్నర ఏండ్లుగా టీఆర్ఎస్ సర్కారు చేస్తోన్న పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులైన సంపత్ మరో పదేండ్ల వరకు కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరంగా ఉండటం ..నియోజక వర్గ అభివృద్ధి కోసం ఆయన ఈ నిర్ణయం తీసుకోనున్నారు అని సమాచారం .చూడాలి మరి సంపత్ ఏ నిర్ణయం తీసుకుంటారో ..?