Home / ANDHRAPRADESH / ఏపీలో 200 కంపెనీలు ..10వేల కోట్లు పెట్టుబడులు -చంద్రబాబు ..

ఏపీలో 200 కంపెనీలు ..10వేల కోట్లు పెట్టుబడులు -చంద్రబాబు ..

ఏపీ రాష్ట్రంలో విజయవాడకు వచ్చిన బుసాన్‌ కాన్సుల్‌ జనరల్‌ జియాంగ్‌ డియోక్‌ మిన్‌తో పాటు ముప్పై మంది దక్షిణకొరియా పారిశ్రామికవేత్తల బృందంతో గేట్‌వే హోటల్‌లో పరిశ్రమల మంత్రి ఎన్‌.అమరనాథ్‌రెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్‌ పి.కృష్ణయ్య, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌, ఏపీఐఐసీ వీసీఎండీ అహ్మద్‌ బాబు, పరిశ్రమలశాఖ కమిషనర్‌ సిద్ధార్థ జైన్‌ తదితరులతో భేటీ అయ్యారు.

అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబును సచివాలయంలో కలిశారు.ఈ సందర్భంగా చంద్రబాబు రాష్ట్రాన్ని రెండో రాజధానిగా మార్చుకుని ఇక్కడ భారీ సంఖ్యలో పరిశ్రమలను స్థాపించాలని వారిని ఆహ్వానించారు. ఇక్కడ పెట్టుబడులు పెడితే ప్రభుత్వం అన్నివిధాలా సహకరిస్తుందన్నారు. బుసాన్‌ తరహాలో అమరావతిలో గానీ, రాష్ట్రంలో అన్ని అనుకూలతలూ కలిగిన మరో ప్రాంతంలో గానీ కొరియన్‌ సిటీని ఏర్పాటు చేస్తామని, అక్కడ పారిశ్రామికాభివృద్ధి పార్కును అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.

అయితే భూ కేటాయింపులు, ప్రోత్సాహకాలపై స్పష్టతను ఇస్తే ఆంధ్రప్రదేశ్‌కు తరలివచ్చేస్తామని దక్షిణ కొరియాకు చెందిన బుసాన్‌ పారిశ్రామికవేత్తలు స్పష్టం చేశారు. బుసాన్‌ నుంచి 200 కంపెనీలు తక్షణమే రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నాయని, ఈ పెట్టుబడుల విలువ రూ.10,000 కోట్లు ఉంటుందని వారు వివరించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat