హిందీలో కంగనా రనౌత్ నటించిన మూవీ “క్వీన్”. ఈ మూవీ బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ మూవీని సౌత్ లో రీమేక్ చేయడానికి ఎంతో కాలంగా ప్రొడ్యూసర్స్ ట్రై చేసి చేసి ఫైనల్ గా ఈ మూవీకి సంబంధించిన పనులను స్టార్ట్ చేసారు. ఈ సినిమా “క్వీన్” అనే టైటిల్‌తో ప్రస్తుతం తెలుగులో రీమేక్ అవుతున్నది. ఇందులో తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. తమన్న ప్రముఖ పాత్రలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత అయిన నీలకంఠ దర్శకత్వం వహిస్తున్నారు.
తాజాగా ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినీ రంగంలో లైంగిక దాడులకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేసింది మిల్కీ బ్యూటీ. హీరోయిన్లను పక్కలోకి రమ్మని పిలిచే అలవాటు సినీ రంగంలో ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది తమన్నా. అయితే, గత కొంతకాలంగా సినిమా రంగంలో క్యాస్టింగ్ కౌచ్ గురించి పలువురు హీరోయిన్లు రకరకాల ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ జాబితాలో ఇప్పుడు తమన్నా చేరింది. అయితే, తనను ఎవరూ పడక సుఖం అందించలేదని కోరలేదని, ఒత్తిడి కూడా చేయలేదని ఎవరూ తనను అడగలేదని చెప్పుకొచ్చింది తమన్నా. కాకపోతే ఇలాంటి ఆరోపణలు చేస్తున్న వారు కూడా ఉన్నారు కాబట్టి అలాంటి వారు ఉన్నారని అనుకుంటున్నానంటోంది.
స్టార్ హీరోయిన్‌లకు కూడా ఆ ఇబ్బంది ఉంది. అయితే కొత్తగా వస్తున్న హీరోయిన్లకు ఈ బెడద మరీ ఎక్కువగా ఉంది. కానీ, కొంతమంది అలాంటి వారికి లొంగి పోతుంటే.. మరికొంత మంది మాత్రం ఎదురు తిరుగుతున్నారని చెప్పుకొచ్చింది. ఇలాంటి వారు ఉండటం వల్లే కొత్త వారికి వేధింపుల సమస్యలు తగ్గాయని భావిస్తున్నానంది. అయితే, తాను సినీ ఇండస్ర్టీకి పరిచయమైన రోజుల్లో మాత్రం ఏం జరిగిందన్న విషయంపై మిల్కీబ్యూటీ నోరు మెదపకపోవడం గమనార్హం.