టాలీవుడ్ యంగ్ హీరోల్లో సందీప్ కిషన్ చాలాకాలంగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు.వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తర్వాత తన స్థాయికి తగిన హిట్ లేని సందీప్ కిషన్‌కు ఇప్పుడు కెరీర్ పరంగా అర్జెంటుగా ఓ హిట్ సినిమా అవసరం. నగరం, నక్షత్రం ఇలా ఎన్నో సినిమాలు చేస్తూన్నా అవన్నీ డిజాస్టర్ల మీద డిజాస్టర్లు అవుతున్నాయి.
అయితే తాజాగా సందీప్ కోలీవుడ్ దర్శకుడు సుశీంద్రన్ దర్శకత్వంలో నటించిన ద్విబాషా చిత్రం c/o సూర్య. ఇటీవల వరుస హిట్లతో గోల్డెన్‌గర్ల్‌గా పేరు తెచ్చుకున్న మెహ్రీన్ కౌర్ సందీప్ పక్కన నటించిన ఈ సినిమాలో నటిస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఈ శుక్రవారమే రిలీజ్ అయ్యింది. ఇప్పటికే ప్రీమియర్ షోలు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా టాక్ ఎలా ఉందో షార్ట్ రివ్యూలో చూసేద్దాం.
సినిమా ఫస్టాఫ్ అంతా ప్రేక్షకుడు స్క్రీన్‌కు అతుక్కుపోయేలా గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో సుశీంద్రన్ తెరకెక్కించాడు. సందీప్‌కిషన్ క్యారెక్టర్ డిజైన్ చేసుకున్న తీరు, నేచురల్‌గా అతడి క్యారెక్టర్ తీర్చిదిద్దిన విధానం, క్రైం, సస్పెన్స్ మెయింటైన్ చేయడం బాగుంది. ఓవరాల్‌గా ఫస్టాఫ్ మొత్తం డీసెంట్‌గా ఉందని.. ప్రేక్షకులు ఫస్టాఫ్‌ని ఎంజాయ్ చేయడం ఖాయమని.. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే ఫస్టాఫ్‌కే హైలెట్ అని సమాచారం.
ఇక కీలకమైన సెకండాఫ్‌కు వస్తే ఫస్టాఫ్‌లో మెయింటైన్ చేసిన గ్రిప్పింగ్ ఇక్కడ కాస్త సడలింది. సందీప్ కిషన్‌కు – విలన్ గ్యాంగ్‌కు మధ్య వచ్చే మైండ్‌గేమ్ సన్నివేశాలు బాగున్నాయి. క్రైం కథలోనే సస్పెన్స్ మెయింటైన్ చేయడం బాగుంది. ఓవరాల్‌గా ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ అంచనాలు కాస్త తగ్గిందని తెలుస్తోంది. అయితే క్రైమ్ థ్రిల్లర్ లను ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా బాగా నచ్చుతోందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.