ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు లేకుండానే ఈ రోజు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి .ఈ సందర్భంగా టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సభలో మాట్లాడారు .ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ వచ్చే వారంతో నేను రాజకీయాల్లోకి వచ్చి నలబై ఏళ్ళు పూర్తికానున్నాయి అని అన్నారు .
నా నలబై యేండ్ల రాజకీయ జీవితంలో ప్రతిపక్షం లేని సభను చూడాల్సిన సరికొత్త అనుభూతి కల్గింది అని వ్యాఖ్యానించారు .అయితే ఈ రోజు సభ ప్రారంభం కానున్న నేపథ్యంలో నిన్న టీడీపీ స్టాటజీ కమిటీ ,శాసనసభపక్ష సమావేశంలో బాబు చర్చించారు .టీడీఎల్పీలో బాబు మాట్లాడుతూ సభలో ప్రతిపక్ష పార్టీ సభ్యులు లేరని అధికార పార్టీ ఎమ్మెల్యేలు తేలిగ్గా తీసుకోవద్దు ..ఎవరు డుమ్మా కొట్టవద్దు అని ఆయన అన్నారు .