ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ఈ శుక్రవారం ప్రారంభం కానున్నాయి. చరిత్రలో తొలిసారిగా ప్రతిపక్షం లేకుండా ఏపీ శాసనసభ నేటి నుంచి జరగబోతోంది. పార్టీ మారిన 22 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేంత వరకూ తాము శాసనసభకు రాబోమని ప్రతిపక్ష వైసీపీ ఇప్పటికే స్పష్టం చేసింది. తాజాగా కూడా మరో ఎమ్మెల్యే వంతల రాజేశ్వరిని పార్టీలోకి చేర్చుకోవడంపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
అయితే అనర్హత వేటు వివాదం కోర్టు పరిధిలో ఉన్నందున తాను నిర్ణయం తీసుకోలేని ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్పష్టం చేశారు. తాను నిర్ణయం తీసుకోకముందే వైసీపీ కోర్టుకు వెళ్లడంతో తాను దీనిపై ఎలా నిర్ణయం తీసుకుంటానని ప్రశ్నిస్తున్నారు. దీనికి వైసీపీ కూడా ధీటుగానే సమాధనమిచ్చింది. వైసీపీ ఎమ్మెల్యే రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ వేటు ఎలా వేశారని ప్రశ్నించింది. అంతేకాకుండా వైసీపీ టిక్కెట్ మీద గెలిచి మంత్రులుగా సభలో కూర్చున్నా స్పీకర్ చోద్యం చూస్తున్నారని ఎద్దేవా చేసింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షం లేకుండానే ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.