ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహించిన సంగతి విదితమే .అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను మొదలెట్టిన రోజు నుండే అధికార పార్టీ అయిన టీడీపీకి చెందిన నేతలు విమర్శల పర్వం కొనసాగిస్తూ వస్తున్నారు .
ఈ నేపథ్యంలో మంత్రులు జవహర్ నుండి ఆదినారాయణ రెడ్డి వరకు అందరు విమర్శల వర్షం కురిపిస్తున్నారు .గత ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరి మంత్రి పదవి చేపట్టిన ఆదినారాయణ రెడ్డి జగన్ పాదయాత్రపై స్పందిస్తూ జగన్ పొర్లు దండాలు పెట్టిన కానీ సీఎం కాలేడు .
జగన్ ను అలా వదిలేస్తే తెలంగాణకు షర్మిలా సీఎం ,వైఎస్ విజయమ్మను రాష్ట్రపతిగా చేస్తాను అని అంటాడు అంటూ సెటైర్లు వేశారు .అంతే కాకుండా వైసీపీ ఏపీ ప్రజల పాలిట వైరస్ లాంటిది .టీడీపీ పార్టీ మాత్రం ఆ వైరస్ కు యాంటీ వైరస్ లాంటిది అని ఆయన అన్నారు .ఇకనైనా జగన్ తన తీరు మార్చుకోవాలని సలహా ఇచ్చారు .