విరాట్ కోహ్లీకి కోపం వచ్చింది .అంతా ఇంతా కాదు ఏకంగా క్రికెట్ విమర్శకులను విమర్శించే అంతగా .ఇటీవల కివీస్ తో జరిగిన రెండో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో టీం ఇండియా ఓడిపోయిన సంగతి తెల్సిందే .ఆ మ్యాచ్ లో టీం ఇండియా స్టార్ ఆటగాడు అయిన ఎంఎస్ ధోని పరిస్థితులకు తగ్గట్లు ఆడలేకపోవడంతో మాజీ ఆటగాళ్ళు లక్ష్మణ్ ,అగార్కర్ ఆటగాళ్ళు ధోని ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లను యువతకు వదిలేస్తే మంచిది అని సూచిస్తూ పరోక్షంగా విమర్శల వర్షం కురిపించారు .
ఈ వ్యాఖ్యలపై టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందిస్తూ కావాలనే పని కట్టుకొని మరి ధోని పై విరుచుకుపడుతున్నారు .ఇతర ఆటగాళ్ళు విఫలమైన కానీ ఒక్క మాట అనని వారు ఒక్క ధోనినే వ్రేలు ఎత్తి చూపడం ఎంతవరకు కరెక్ట్ అని మండిపడ్డారు .జనం ధోనిని ఎందుకు వ్రేలు ఎత్తి చూపుతున్నారో అర్ధం కావడంలేదు .
ఒకవేళ బ్యాట్స్ మన్ గా నేను మూడు మ్యాచ్ లలో విఫలమైన కానీ ఎవరు నాగురించి మాట్లాడరు .ఎందుకంటే నా వయస్సు ముప్పై ఐదు ఏండ్లు కాదు కదా .కానీ ధోని ముప్పై ఐదు యేండ్ల వయస్సు ఉన్న కానీ పూర్తి పిట్ నెస్ కల్గి ఉన్నాడు .అన్ని పరీక్షల్లో నెగ్గుతున్నాడు .శ్రీలంక ,ఆసీస్ లపై చక్కగా రాణించాడు .అయితే ధోని పై విమర్శలు చేసే ముందు ధోనికి బ్యాటింగ్ చేసే సమయం ఎంత ఉంటుందో చూసి విమర్శించాలి ఎట్లా పడితే అట్లా విమర్శించడం కరెక్ట్ కాదు .అతనికి తెలుసు ఎలా ఎక్కడ ఆడాలో ..చాలా అనుభవజ్ఞుడు అని ధోనిని వెనకేసుకుంటూ వచ్చాడు విరాట్ ..