తాజాగా యాంకర్ రష్మి ఓ షోలో పాల్గొన్నారు. ఆ షోలో రష్మి ఎన్నో విషయాలను షేర్ చేసుకుంది. ముఖ్యంగా ఇప్పటి వరకూ ఎవ్వరికీ తెలియని ఓ విషయాన్ని చెప్పింది. మేల్ యాంకర్స్ నలుగురికి వారి యాంకరింగ్‌కి మార్కులిచ్చిన రష్మి.. ఫిమేల్ యాంకర్స్‌కి కూడా మార్కులిచ్చేసింది. అయితే రోజా గురించి మాట్లాడుతూ.. ఆమెకు 110 ఇస్తానని.. “పంగా నై లేనా మేరే కో” అని సరదాగా తెలిపింది. అంటే రోజాతో పెట్టుకోకూడదు అని హిందీలో తెలిపింది. తర్వాత అనసూయకు 99, శ్రీముఖికి 98 ఇచ్చిన రష్మి తనకు మాత్రం వందకు వంద మార్కులు ఇచ్చుకుంది. ఈ సందర్భంగా హోస్ట్.. ఈ రోజే.. ఇప్పుడే చెప్పాను.. అనుకునే కొత్త విషయం ఒకటి చెప్పమనగా.. “నేను ఎప్పుడైనా టీ చేస్తే అస్సలు తాగకండి. చాలా దరిద్రంగా చేస్తాను. టీ మేకింగ్ సింప్లెస్ట్ థింగ్ కదా.. కానీ నేను చేసే టీ కంటే గో మూత్రం బెటర్” అంటూ ఆన్సర్ చేసింది రష్మి.
