వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోవడంతో టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా బయటకి వచ్చి జగన్‌ను టార్గెట్ చేసుకొని.. అటాక్ చేయడం మొదలు పెట్టారు. ఇప్పుడు తాజాగా ప్యారడైజ్ పేపర్ల లీక్స్ .. చంద్రబాబు నిరూపించాలని డిమాండ్ చేయడం అర్థరహితమని టీడీపీ నేత వర్ల రామయ్య వ్యాఖ్యానించారు.
జగన్‌కు దమ్ము, ధైర్యం ఉంటే ఆయన కేసులు విచారిస్తున్న సీబీఐ, అవినీతి మూలాలను మరింతగా బయటపెట్టిన ప్యారడైజ్, వాటిని ప్రచురించిన ఇండియన్ ఎక్స్ ప్రెస్ పై చాలెంజ్ చేయాలని అన్నారు. జగన్ అవినీతిని నిరూపించడానికి తమ అధినేత చంద్రబాబు అక్కర్లేదని, తాను వాటిని నిరూపిస్తానని అన్నారు. జగన్ అంగీకరిస్తే, ఎక్కడైనా చర్చకు సిద్ధమని, జగన్ ఒప్పుకుంటారా అని సవాల్ విసిరారు.
దీంతో వైసీపీ శ్రేణులు వర్ల రామయ్య పై మండిపడుతున్నారు. జగన్ పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి టీడీపీ నేతలకు టార్గెట్స్ ఫిక్స్ చేసి మరీ జగన్ పై వ్యాఖ్యలు చేయాలని.. వీలైనంతవరకు ప్రజల్లో జగన్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేయాలని చంద్రబాబు సూచించారని.. అందులో బాగంగానే టీడీపీ నేతలు.. అనుకూల మీడియా.. తోక మీడియా జగన్‌పై బురదచల్లడానికి ప్రయత్నిస్తున్నారని.. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఏపార్టీ నాలుక కర్చుకుంటుదో తేలిపోతుందని.. ఎల్లో బ్యాచ్ అంతా కలసి.. జగన్ పై ఎన్ని సెటైర్లు వేసినా.. కామెంట్స్ చేసినా.. జగన్ ఇమేజ్‌ను కొంచెం కూడా డ్యామేజ్ చేయలేరని సర్వత్రా అభిప్రాయపడుతున్నారు.