శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి.శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇస్తున్నారు. టీహబ్ సత్ఫలితాలను ఇస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. 25 కార్పోరేట్ సంస్థలతో టీహబ్ భాగస్వామ్యం ఏర్పర్చుకుందన్నారు. స్టార్టప్‌లను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ఐటీ పరిశ్రమల్లో పనిచేస్తున్న మహిళలకు ప్రత్యేక భద్రత కల్పించామన్నారు. మహబూబ్‌నగర్‌లో త్వరలో ఐటీపార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. టీహబ్ -2 ప్రపంచంలో అతిపెద్ద స్టార్టప్ కేంద్రం కానుంది. లక్షా 20వేల ఐటీ ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకోబోతున్నామని ప్రకటించారు. టీ-ఫెడ్‌తో ఔత్సాహిక యువకులకు ఆర్థికసహాయం అందిస్తున్నామని వెల్లడించారు.
బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ప్రతిపాదన..కేటీఆర్
బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. సెయిల్ ద్వారా సమీకృత స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. ఐరన్ ఓర్ అవసరమైన పరిమాణం, తగినంత నాణ్యత లేదని వెల్లడించారు. బయ్యారానికి కొత్త రైల్వేలైన్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపామని తెలిపారు. బయ్యారంలో 73 మిలియన్ టన్నుల ఐరన్ ఓర్ ఉంటే 10 మిలియన్ టన్నులు మాత్రమే నాణ్యమైనదని పేర్కొన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమపై ప్రాథమిక నివేదిక వచ్చిందన్నారు.
Minister @KTRTRS replying to a question in Legislative Assembly on Bayyaram Steel Plant. https://t.co/1q1DMEeL7P
— Min IT, Telangana (@MinIT_Telangana) November 9, 2017