తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి విదితమే .అందులో భాగంగా ఈ రోజు శాసనసభలో మైనార్టీ వర్గాల సంక్షేమం గురించి చర్చ జరిగింది .ఈ చర్చలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు పలు ప్రశ్నలను లేవనెత్తారు .సభలో సభ్యులు సంధించిన పలు ప్రశ్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం ఇచ్చారు .
ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉర్దూ భాషను పరిరక్షిస్తామని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా ఉర్దూ స్పెషల్ డీఎస్సీ ద్వారా మొత్తం 900 పోస్టులు భర్తీ చేస్తమని హామీ ఇచ్చారు .అంతే కాకుండా రాష్ట్రంలో ఉర్దూ అకాడమీలో 66 మంది ఉద్యోగులను నియమిస్తమన్నారు. లెక్టరేట్లతోపాటు ముఖ్య కార్యాలయాల్లో ఉర్దూ ఆఫీసర్ల నియామకం చేపడుతామని ముఖ్యమంత్రి తెలిపారు. అంతే కాకుండా నీట్ పరీక్షను ఉర్దూలో నిర్వహించాలని ప్రధాని మోదీకి లేఖ రాశామని చెప్పారు. పోటీ పరీక్షలను ఉర్దూ భాషలోనూ నిర్వహిస్తమని తెలిపారు .