ప్రముఖ తమిళ సినిమాటోగ్రాఫర్ ప్రియన్ కన్నుమూశారు. గురువారం మధ్యాహ్నం ఆయనకు తీవ్రమైన గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తన సినీ కెరీర్లో ఎక్కువగా దర్శకుడు హరి తెరకెక్కించిన చిత్రాలకు ఛాయాగ్రహణం అందించారు. ముఖ్యంగా హరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సింగమ్’ సిరీస్ చిత్రాలకు ప్రియన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ప్రస్తుతం విక్రమ్-హరి దర్శకత్వంలో ‘సామి స్క్వేర్ చిత్రానికి పనిచేస్తున్నారు. 2003లో వచ్చిన సామి చిత్రానికి సీక్వెల్ ఇది. హరితో కలిసి దాదాపు 13 చిత్రాలకు ప్రియన్ పనిచేశారు.
ప్రియన్ తమిళనాడు విరుదున్గర్లోని నాగేంద్రన్లో జన్మించారు. నటుడు, నిర్మాత కె.బాలాజీ యూనిట్లో అసిస్టెంట్ కెమేరామెన్‌గా పనిచేశారు. కె.ఎస్.అధియామన్స్ దర్శకత్వంలో వచ్చిన ‘తోటచిన్గుని’ చిత్రానికి తొలిసారి కెమేరామెన్‌గా పనిచేశారు. ఆ తర్వాత ‘తెనాలి’, ‘వల్లవన్’, ‘వేలాయుధం’, ‘పూజ’ తదితర ఎన్నో విజయవంతమైన చిత్రాలకు ఛాయాగ్రహణం అందించారు. ప్రియన్ మృతితో తమిళ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
