స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన రేసు గుర్రం చిత్రంలో మద్దాలి శివారెడ్డిగా అలరించిన రవికిషన్ అందరికి గుర్తుండే ఉంటుంది. ఈయనతో మన సెక్సీ రాయ్ .. రాయ్ లక్ష్మీ స్టెప్పులు ఇరగదీసింది. జూలీ2 చిత్రంలో భాగంగా టీం.. ఖరమా ఖరమా అనే సాంగ్ విడుదల చేసింది. ఇందులో రాయ్ లక్ష్మీ అందాలు యూత్ కి పిచ్చెక్కిస్తున్నాయి. మూవీ స్టార్ట్ అయినప్పటి నుండి రాయ్ లక్ష్మీకి సంబంధించి ఏదో ఒక పోస్టర్ కాని, వీడియో కాని విడుదల చేస్తూ నిర్మాతలు సినిమాకి ఫుల్ ప్రమోట్ చేసుకున్న సంగతి తెలిసిందే. నేహ ధూపియా ప్రధాన పాత్రలో రూపొందిన జూలికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శివదాసాన్ని రూపొందిస్తున్నాడు. రతి అగ్నిహోత్రి, సాహిల్ సలాతియా, ఆదిత్య శ్రీ వాస్తవ, రవి కిషన్, పంకజ్ త్రిపాఠి, నిషికాంత్ కామంత్ ప్రధాన పాత్రలు పోషించారు . బాలీవుడ్ లో ఉన్న చీకటి కోణంతో పాటు అండర్ వరల్డ్ మరియు రాజకీయాలలో ఉన్న నగ్న సత్యాన్ని తెలిపేలా ఈ మూవీ తెరకెక్కింది.