Home / POLITICS / స‌త్తుప‌ల్లిని ఆద‌ర్శ మున్సిపాలిటీ చేద్దాం…మంత్రులు కేటీఆర్‌, తుమ్మ‌ల ..

స‌త్తుప‌ల్లిని ఆద‌ర్శ మున్సిపాలిటీ చేద్దాం…మంత్రులు కేటీఆర్‌, తుమ్మ‌ల ..

ఖ‌మ్మం జిల్లా సత్తుపల్లిని అదర్శ మున్సిపాలిటీగా మార్చాలని మంత్రి కే తార‌క‌రామారావు అన్నారు. ఈ రోజు హైదరాబాదులోని బేగంపేట్ క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మరియు ఎంపీ, ఎమ్మెల్యే, నగర పంచాయతీ చైర్మన్లు, వార్డు స‌భ్యుల‌తో సమావేశమయ్యారు. సత్తుపల్లిని ఒక మోడల్ మున్సీపాలిటీగా మార్చేందుకు అవసరం అయిన పనులను ప్రారంభించేందుకు  రూ.15 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులను మున్సిపల్ శాఖ తరపున ఇవ్వనున్నట్లు ఈ స‌మావేశంలో మంత్రి కేటీ రామారావు తెలిపారు.
ప్ర‌త్యేక నిధుల‌తో ప్రజ‌ల‌కు అవ‌స‌రమైన క‌నీస మౌళిక వ‌స‌తుల క‌ల్పన చేప‌ట్టాల‌ని మంత్రి కేటీఆర్‌ కోరారు. పట్టణంలో ఉన్న పార్కును మరింత అభివృద్ది చేయాలన్నారు. నగరంలోని వార్డుకోక్క చెత్త తరలింపు స్వచ్చ్ వాహానాలు ఇస్తామన్నారు. పట్టణంలో ఒక వార్డును స్వచ్చ వార్డుగా తీర్చిదిద్దేందుకు తడి పొడి చెత్త కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. ఈ మేరకు అవసరం అయిన నిధులను సమకూర్చుతామన్నారు. పట్టణాన్ని పూర్తిస్థాయి బహిరంగ మలమూత్ర విసర్జన రహిత పట్టణంగా (ఓడిఎఫ్) ప్రకటించేందుకు అవ‌స‌రమైన అన్ని మ‌రుగుదొడ్ల‌ నిర్మాణానికి నిధులు ఇస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ మున్సీపాలీటీకి ఉన్న సమస్యలను మంత్రి కేటీఆర్‌ అడిగి తెలుసుకున్నారు.
పట్టణంలో శ్మశాన వాటిక అభివృద్ది కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మున్సిపల్ ప్రజాప్రతినిధులకు తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ నగరంలోని మహాప్రస్థానం( మాడల్ శ్మశాన వాటిక) మాదిరి నిర్మాణం చేయాలన్నారు. దీంతోపాటు ఇప్పటికే సింగరేణి సంస్ధతో మాట్లాడి ఒక డంపింగ్ యార్డు వెంటనే ఏర్పాటు చేసుకునేలా చూస్తామన్నారు. దీంతోపాటు పట్టణం తామర చెరువు అభివృద్ది, సుందరీకరణకు ప్రత్యేక నిధులు ఇస్తామన్నారు.  ఈ స‌మావేశంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్యే తాటి వేంకటేశ్వర్లు, ఎస్సీ కార్పోరేష‌న్ చైర్మన్ పిడమర్తి రవి, ప‌ట్టణ చైర్ ప‌ర్సన్ దొడ్డకుల స్వాతి, వార్డు సభ్యులు, కమీషనర్ తదిత‌రులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat