తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ,మాజీ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ,ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మద్య వర్గ విబేధాలు ఉన్నాయి గత కొంత కాలంగా వార్తలు వస్తున్నా సంగతి తెల్సిందే .
అందులో భాగంగా ఉత్తమ్ నాయకత్వంలో పార్టీ అధికారంలోకి రాదు అని .అందుకే ఆ బాధ్యతలు తనకు అప్పజెప్పాలని ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,అటు తన సోదరుడు ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సోదరుడుకి ఇవ్వాలని గతంలో చాలా సార్లు మీడియా ముందు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు .తాజాగా కోమటిరెడ్డి ఉత్తమ్ పోస్టుకు ఎసరు పెట్టారు .
అందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలు తనకు కావాలని తమ జాతీయ అధిష్టానాన్ని అడిగానని, దీనిపై హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రెండు దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా ఓటమి లేకుండా పనిచేస్తున్నానని ఆయన చెప్పుకుంటూ వచ్చారు . అయితే నల్లగొండలో తనపై గెలిచేస్థాయి ఎవరికీ లేదన్నారు.