తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ రోజు మైనార్టీ వర్గాల సంక్షేమం గురించి లఘు చర్చ జరిగింది .ఈ చర్చలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ విపక్షాలు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు .విపక్షాలు సంధించిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానమిస్తూ రాష్ట్రంలో ఉన్న మైనార్టీ లకు కాంగ్రెస్ హాయంలో కంటే మా పాలనలోనే మెరుగైన బడ్జెట్ ను ప్రవేశపెట్టాము అని చెప్పారు .
కాంగ్రెస్ హాయంలో పదేండ్ల సమయంలో కేవలం తొమ్మిది వందల కోట్ల ముప్పై రెండు రూపాయలను ఖర్చు చేస్తే తమ ప్రభుత్వం మూడున్నర యేండ్లలో రూ 2 ,146 కోట్లను ఖర్చు చేసింది అని స్పష్టం చేశారు .రాష్ట్రంలో ముస్లిం వర్గాల రిజర్వేషన్లు విషయం కేంద్రం పరిశీలనలో ఉంది .తమిళనాడు మాదిరిగా రాష్ట్రంలో అమలు చేయాలనీ తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది అని తెలిపారు
.రిజర్వేషన్ల విషయం మీద ప్రధాని మోదీతో మాట్లాడాం .సానుకూలత వ్యక్తం చేశారు అని అన్నారు .రానున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో తమ సభ్యులు పోరాటం చేస్తారు .తెలంగాణను తెచ్చిన విధంగా రిజర్వేషన్లను సాధించి తీరుతాం ఆయన అన్నారు .