“రైతే రాజు” అని వినడమేగానీ 60 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో పాలకులు ఆ దిశగా కృషిచేసిన దాఖలాలు లేవు.
దీనికి అనేక కారణాలే ఉన్నాయి, ఎరువుల కొరత, సాగునీటి సమస్య, రైతాంగానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా, కరువు, మద్దతు ధర కల్పించడంలో విఫలమవ్వడం ప్రధానమైన కారణాలు. ఎన్నికల సమయం ఆసన్నమైనప్పుడల్లా రైతును, వ్యవసాయ రంగాన్ని కేంద్రంగా చేసుకుని రూపొందించి మానిఫెస్టోలో పొందుపరచి హామీలు గుప్పించి అధికారంలోకి వస్తారు, మొదటి సంతకం పేరుతో మభ్యపెట్టారు తాత్కాలిక ప్రణాళికలే తప్పితే ఏనాడు రైతాంగం సమస్యలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేదు దీర్ఘకాలిక ప్రణాళికలు రచించలేదు ఆ దిశగా ఆలోచించను లేదు.స్వతంత్రం వచ్చిన నాటినుండి నిన్నటి కిరణ్ కుమార్ రెడ్డి హయాం వరకు రైతాంగంపై ఎన్నో వాగ్దానాలు, హామీలు ఇవ్వడం అవి సాధ్యంకాక కుదించడం తద్వారా రైతుల ఆత్మస్థైర్యం దెబ్బ తినడం, అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకోవడం మామూలైపోయింది.
తెలంగాణ రైతాంగం కోసమని ప్రతిపాదించిన ప్రాజెక్టులు ప్రారంభ దశలోనే ఉండిపోవడం, అనుమతుల పేర నిర్మాణ పనులు ఆగిపోవడం ఒక ఎత్తైతే 9గంటల ఉచిత విద్యుత్ అని వాగ్దానం ఇచ్చి 7 గంటలకు కుదించడం. ఇచ్చే ఉచిత విద్యుత్ లో నాణ్యత లోపించడం. లోఓల్టేజ్ సమస్యతో మోటర్లు, ట్రాన్స్ఫార్మర్ లు కాలిపోవడం, కాలిపోయిన మోటర్లను మోసుకొని టౌనుకు తీసుకెళ్ళడం బాగు చేయించడం, బిగించడం మళ్ళీ నెలకో పదిహేను రోజులకో మోటర్లు కాలిపోవడం నిత్య నరకంగా మారింది.
ఒకవైపు మోటర్ల మరమ్మత్తుల పేరిట కర్చు భారం ఇంకోవైపు విద్యుత్ సరఫరాలో అంతరాయలతో సతమతమయినా రైతులు ఆత్మహత్యలకు పూనుకున్నారు.తెలంగాణ సిద్దించిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడిన తొలి తెలంగాణ ప్రభుత్వం భారతదేశంలో ఏ రాష్ట్రం చేయని సాహసం చేయడానికి పూనుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో తెలంగాణ రైతాంగ సమస్యల కోసం తను రచించుకున్న ప్రణాళికలను ఆచరణలోకి తీసుకురావడానికి కార్యాచరణ మొదలు పెట్టారు. ప్రభుత్వం ఏర్పడిన నాటికే రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ కొరత ఉంది విభజన చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రావలసిన విద్యుత్ వాటాను ఆ చంద్రబాబు ఇవ్వకుండా అడ్డుకున్నాడు. ప్రభుత్వానికి అండగా ఉండి ఆంధ్రప్రదేశ్ తో పోరాడి విద్యుత్ వాటా సాధించాల్సిన ప్రతిపక్ష పార్టీలు బాధ్యతలను మరిచి ప్రభుత్వంపై విమర్శన అస్త్రలు సంధిస్తూ రాజకీయ లబ్ధి పొందేందుకు ఆరాటపడ్డాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం ముందు విద్యుత్ సమస్యలు తలవంచాయి. రెండో యేడాదిలో విద్యుత్ కొరతలు లేని సరఫరా చేయడం అటు పరిశ్రమలకు ఇటు వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ ఇవ్వడంతో ప్రతిపక్షాల నోళ్ళు మూత పడ్డాయి. 2015 వేసవికాలంలో ఎండ తీవ్రంగా ఉంది, కొన్ని సబ్ స్టేషన్లలో ట్రాన్స్ఫర్మర్ లు వేడిని తట్టుకోలేక కాలిపోవడం జరిగింది మరల సమస్యలు ఉత్పన్నం కాకుండా ట్రాన్స్ఫర్మర్ ల చుట్టు కూలర్లను ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిది.
గత ప్రభుత్వాల పాలనలో విద్యుత్ కొరతలపై ఎన్నో పోరాటాలు జరిగాయి, బషీర్ బాగ్ కాల్పులు , ఇందిరా పార్క్ దెగ్గర పారిశ్రామికవేత్తల ధర్నాలు, అసెంబ్లీ సమావేశాలకు వచ్చే వివిధ పార్టీల ఎమ్మెల్యేల లాంతరు ప్రదర్శనలు ఇలా చెప్పుకుంటుపోతే విద్యుత్ కొరత రాష్ట్రంలో ప్రధాన సమస్యగా మారింది. అరవై ఏళ్ళ పాలనలో సాధ్యంకాని సమస్యను మూడేళ్ల వ్యవధిలో పరిష్కారం చూపిన ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు తానే బరిగీసి కొట్లాడి విజయం సాధించిండు తెలంగాణను నిలబెట్టిండు.రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణ అంధకారమే అన్నా నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపణలు పటాపంచలయ్యాయి.”తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఒక మాట పదేపదే చెప్పే వారు, తెలంగాణ తెచ్చుకోవడం ఎంత ముఖ్యమో తెచ్చుకున్న తెలంగాణను నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం అని”తెలంగాణ తెచ్చిన తెలంగాణను నిలబెడుతున్న కేసీఆర్ గారి కార్యదీక్షకు పరిపాలన తీరుకు తెలంగాణ ప్రజానీకం ఫిదా అవుతుంది.వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ తోపాటు నాణ్యమైన సరఫరా అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మా ప్రభుత్వం అని చెప్పుకోవడానికి తెలంగాణ బిడ్డగా గర్వపడుతున్నాను.
By
నాగేందర్ రెడ్డి కాసర్ల
అధ్యక్షులు, టీఆర్ఎస్ ఆస్ట్రేలియా.