వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్రం నాల్గవ రోజుకు చేరుకుంది. ఇప్పటికే జగన్ దాదాపు 36 కిలోమీటర్లు నడిచారని తెలుస్తోంది. జగన్ పాదయాత్రకి జనం నుండి కూడా స్పందన బాగానే వస్తోంది. అయితే ఇప్పుడు జగన్ ఒక సమస్యతో బాధపడుతున్నారని.. దీంతో వైసీపీ వర్గీయులు కొంత ఆందోళణలో ఉన్నారని సమాచారం.
జగన్ పాదయాత్రలో కొంచెం అస్వస్థకు గురయ్యారని తెలుస్తోంది. జగన్ కొంత వెన్నునొప్పితో బాధపడుతుండటంతో ప్రత్యేక వైద్యుడిని తిరుపతి నుంచి రప్పించారని తెలిసింది. తిరుపతి నుంచి వచ్చిన ఫిజియోథెరపిస్టు జగన్ కు విశ్రాంతి సమయంలో చికిత్స చేస్తున్నారు. జగన్ దాదాపు మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయాల్సి ఉంది. యాత్ర ప్రారంభించిన రెండో రోజే జగన్ వెన్నునొప్పి రావడంతో వైసీపీ నేతలు కొంత ఆందోళనకు గురయ్యారు.
అయితే వెంటనే తేరుకున్న వైసీపీ శ్రేణులు తిరుపతి నుంచి ఫిజియోథెరపిస్టును పిలిపించారట. పాదయాత్రలో భాగంగా జగన్ ఎక్కువగా తారు రోడ్డు మీద నడవటంతో ఆయనకు వెన్నునొప్పి వచ్చినట్లు వైద్యలు చెప్పినట్లు తెలిసింది. తారు రోడ్డు పక్కనే ఉండే మట్టిరోడ్డు మీద నడిస్తే ఇటువంటి సమస్యలు రావని.. జగన్ నడకలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలనిసూచించారని.. దాంతో వెన్నునొప్పి లాంటి ఇబ్బందులు తలెత్తవని వైద్యులు చెప్పారని సమాచారం. దీంతో మట్టిరోడ్డు మీదనే జగన్ నడిచేలా వైసీపీ శ్రేణులు ప్లాన్ చేస్తున్నాయి.