తెలంగాణ రాష్ట్రంలో గత మూడున్నర ఏండ్లుగా జరుగుతున్న ప్రచారం నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి,ప్రస్తుత ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,ఆయన సోదరుడు ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హస్తం పార్టీకి గుడ్ బై చెప్పి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరతారు అని .ఇదే విషయం గురించి నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా గతంలో కోమటిరెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరాలని ..ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవాలని తెగ ప్రయత్నాలు చేశారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు .
తాజాగా ఈ ఉహగానలకు ఊతమిచ్చే సంఘటన రాష్ట్ర అసెంబ్లీ లాబీల్లో చోటు చేసుకుంది .అసలు విషయానికి వస్తే ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అధికార పార్టీ టీఆర్‌ఎస్ కి చెందిన ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మధ్య ఒక సరదా సంభాషణ చోటుచేసుకుంది. అందులో భాగంగా ఎమ్మెల్యే శ్రీనివాస్‌ను పలకరించిన కోమటిరెడ్డి.. ‘శ్రీనన్నా.. మంత్రి పదవి రాలేదని రంది పెట్టుకున్నవా..? ఉద్యమ సమయంలో మీరు, స్వామిగౌడ్ లాఠీ దెబ్బలు తిన్నారు కదా.
మీకు మంత్రి పదవి వస్తే బాగుండేదన్నా..’అని అన్నారు. దీనిపై స్పందించిన శ్రీనివాస్ గౌడ్.. ‘అదేం లేదన్నా.. మంత్రి పదవి వచ్చే టైమ్‌లో వస్తుంది.. అయినా మా ప్రభుత్వం వచ్చింది కదా? సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారు కదా..’అని ఆయన అన్నారు. ‘ఉద్యమం చేసిన తలసాని, తుమ్మలకు మంత్రి పదవులు వచ్చాయి కదా..’ అని కోమటిరెడ్డి చమత్కరించారు. ‘ఇదంతా ఎందుకు? మీరెప్పుడు మా పార్టీలోకి వస్తున్నరో చెప్పండి..మీరు కూడా మంత్రి పదవి కావాలని ఆశిస్తున్నారా .మంత్రి పదవి ఇస్తే వస్తారా అని శ్రీనివాస్ గౌడ్ చమత్కరించారు .