క్రికెటర్లకు మన దేశంలో ఉన్న క్రేజే వేరు. తమ ఆటతీరుతో చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు. కోహ్లీ, పాండ్య, బుమ్రా, భువనేశ్వర్ లాంటి యువ ఆటగాళ్లకు మహిళా అభిమానులే ఎక్కువ. ఇంతకుముందు సచిన్, గంగూలీ, ద్రవిడ్, ధోనీ తదితర క్రికెటర్లను ఎంతో మంది తమ కలల రాకుమారుడిగా వూహించుకునే వాళ్లు.
మొన్నటికి మొన్న బాలీవుడ్ భామ కైరా అడ్వాణీ.. మహేంద్ర సింగ్ ధోనీతో డేటింగ్ చేయాలని, అతనితో కలిసి బైక్‌పై విహరించాలని ఉందని వెల్లడించింది. తాజాగా టాలీవుడ్ భామ అనుష్క తన అభిమాన క్రికెటర్ ఎవరో తెలిపింది. అంతేకాదండోయ్ ఒకానొక సమయంలో ఆ క్రికెటర్‌తో ఆమె ప్రేమలో కూడా పడిపోయిందట.. ఈ విషయం అనుష్కనే స్వయంగా వెల్లడించింది. ఇంతకీ అతడు ఎవరా అని ఆలోచిస్తున్నారా..!
తాజాగా అనుష్క ఓ వెబ్ పోర్టల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఓ అభిమాని.. మీ అభిమాన క్రికెటర్ ఎవరు అని ప్రశ్నించాడు. దీనికి అనుష్క ‘రాహుల్ ద్రవిడ్ నా అభిమాన క్రికెటర్. నా చిన్నతనం నుంచి అతనంటే నాకు పిచ్చి. ఎంతలా అంటే ఒకానొక సమయంలో ద్రవిడ్‌తో పీకల్లోతు ప్రేమలో పడిపోయా’ అని బదులిచ్చింది.
