ప్రముఖ ఒగ్గు కళాకారుడు చుక్కాసత్తయ్య(82) మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చుక్కా సత్తయ్య మృతి తీరని లోటని సీఎం అన్నారు. తెలంగాణతోపాటు యావత్‌దేశం గర్వించదగ్గ కళాకారుడిగా చుక్కాసత్తయ్య ప్రపంచఖ్యాతిని ఆర్జించారని పేర్కొన్నారు. చుక్కాసత్తయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.