తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. కంటి రెప్పలా చూసుకోవాల్సిన అన్నయ్యలు చెల్లిని చిత్రహింసలకు గురి చేశారు. భార్యల మాటలు విన్న ముగ్గురు అన్నలు చెల్లెలు గీతకు నరకం చూపించారు. ఆమెను ఇంట్లోనే గొలుసులతో కట్టేసి రాక్షసుల్లా ప్రవర్తించారు. ఇంట్లో పనులు చేయించుకున్న తర్వాత గొలుసులు వేసి బంధించారు. చిన్నప్పుడే తల్లిదండ్రులు మృతి చెందడంతో అన్న వదినల వద్ద ఉంటూ డిగ్రీ పూర్తి చేసింది గీత. అన్నయ్యలు, వదినల చిత్రహింసలు భరించలేక కాపాడాలంటూ స్థానిక కౌన్సిలర్ హరీశ్‌ను ఆశ్రయించింది. గీత బాధలు విన్న కౌన్సిలర్ హరీశ్ నోరెళ్లబెట్టారు. అన్నా వదినలు వద్దని బాధితురాలు చెప్పడంతో గీతను అనాధాశ్రమానికి తీసుకెళ్లారు.
