ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర గ్రాండ్‌గా స్టార్ట్ అయ్యింది. జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యత్రకు విశేష స్పందన లభిస్తోండడంతో టీడీపీ టీమ్ విషప్రచారానికి దిగిన సంగతి తెలిసిందే. దీంతో పాదయాత్రలో భాగంగానే టీడీపీ చేస్తున్న వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు.
అసలు విషయం ఏంటంటే జగన్ పాదయాత్ర ప్రారంబించిన రోజే ప్యారడైజ్ లీక్స్‌లో జగన్ అంటూ చంద్రబాబు అనుకూల మీడియా ఆంద్రజ్యోతి ఒక కథనాన్ని ప్రచురించింది. దీంతో వెంటనే స్పందించిన జగన్ చంద్రబాబుకు సవాల్ విసిరారు. చంద్రబాబుకు 15 రోజులు టైమ్ ఇస్తున్నా.. విదేశాల్లో పైసా ఉందని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా..నిరూపించకపోతే చంద్రబాబు సీయం పదవి నుండి తప్పుకుంటారా..అంటూ జగన్.. చంద్రబాబుకు సవాల్ విసిరారు.
దీంతో ఖంగుతిన్న టీడీపీ శ్రేణులు రాత్రంతా కష్టపడి మల్లగుల్లాలు పడి తెలుగు సినిమా పాత చింతకాయ పచ్చడి కథ లాగా మరోకథనాన్ని గురువారం ఆంద్రజ్యోతి ప్రచురించింది. ఆంద్ర జ్యోతి రాసిన వివరాలు చూస్తే.. దివంగత మహానేత వై.యస్ రాజశేఖర్ రెడ్డి ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాన్ పిక్ ప్రాజెక్ట్ కోసం యు.ఏ.యి సంస్థ రస్ అల్ ఖైమా (రాకీయా) అనే సంస్థకి భూమి కేటాయించిందని, రాకియాకి మారిషస్‌లో ఉన్న కంపెనీల ద్వారా నిమ్మగడ్డ ప్రసాద్‌కి చెందిన 3 కంపెనీలకి డబ్బు బదలాయించారని, ఆ డబ్బే నిమ్మగడ్డ ప్రసాద్ భారతి సిమెంట్స్‌లో, జగతిలో పెట్టుబడిగా పెట్టారని ఒక పసలేని తెలుగు కమర్షియల్ సినిమా రొడ్డ కొట్టుడు లాంటి ఉహాజనిత కథనాన్ని ప్రచురించింది. ఇక్కడ ఆంద్రజ్యోతి నానా కష్టాలు పడి అవి జగన్ డబ్బులే అని ప్రజలని నమ్మించడానికి ఎంతో ప్రయాసపడింది.
# ఆంద్రజ్యోతి తారుమారు చేసిన నిజాలు..
నిమ్మగడ్డ ప్రసాద్ జగన్ కంపెనీలలో పెటిన పెట్టుబడులలో 80 శాతం వాన్ పిక్ ప్రాజెక్టు పెట్టక ముందు.., ఆ తరువాత వై.యస్ మరణించిన తర్వాత పెట్టిన పెట్టుబడులే అని లెక్కలతో సహా కోర్టులో నిమ్మగడ్డ ప్రసాద్ నివేదిక ఇచ్చారు. వాన్‌పిక్ ద్వారా లాభాలు వచ్చినందుకే… జగన్ కంపెనీలో నిమ్మగడ్డ పెట్టుబడులు పెట్టారని చెప్పిన ఆంద్రజ్యోతి.., అదే నిమ్మగడ్డ ప్రసాద్ వై.యస్ చనిపొయిన 9 నెలల తర్వాత కూడా జగన్ కంపెనీలో పెట్టుబడి పెట్టిన విషయం ఎందుకు చెప్పడంలేదు.. చనిపొయిన వ్యక్తి నుండి ఇంకా ఏం ఆశించి పెట్టుబడులు పెట్టారో కూడా ఈ ఆంద్ర జ్యోతి చెబితే బాగుండేది..
ఇక 11.3.2008 న రాష్ట్ర ప్రభుత్వానికి – రాకియా (రస్ అల్ ఖైమా సంస్థ) కి మద్య వాన్ పిక్ ఒప్పందం కుదిరింది. అయితే జగన్ కంపెనీలో నిమ్మగడ్డ 2006 డిసెంబర్ నుండి అంటే 14 నెలల ముందు నుండి పెట్టుబడులు పెట్టటం ప్రారంభించారు. మరి 14 నెలల ముందు నుండి పెట్టిన పెట్టుబడులు చూపి ఇవే రాకియా డబ్బని చెప్పటం ప్రజల్ని తప్పు దొవ పట్టించడం కాదా.. అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి – రాకియా సంస్థకి మద్య వాన్ పిక్ ఒప్పందం కుదిరినప్పుడు భారతి సిమెంట్స్‌లో నిమ్మగడ్డ 2007 లోనే 244 కొట్లు పెట్టుబడి పెట్టారు. 2009 సెప్టెంబర్ 2న వైఎస్ చనిపోయాక ఇతర ఇన్వెస్టర్లతో పాటు ఆయన వాట కూడా ఫ్రాన్స్ కంపెనీ వీకాకు విక్రయించి 265 కొట్లు లాభం పొందారు. అది నిజంగా జగన్ డబ్బు అయితే వాటాలు అమ్మి లాబాలు నిమ్మగడ్డ ఎలా తిసుకున్నారో కూడా ఆంద్రజ్యొతి చెప్పాల్సిందే.
2008లో జగతిలో 50 కొట్లు పెట్టిన నిమ్మగడ్డ ప్రసాద్ వై.యస్ మరణానంతరం.. 2010లో 350 కొట్లు పెట్టుబడులు పెట్టి జగతిలో దాదాపు 18% వాటా పొందారు 2010 లొ వై.యస్ చనిపొయాక ఏమి మేలు జరిగి 350 కొట్లు పెట్టుబడి పెట్టి 18% వాటా పొందారొ కూడా ఆంద్రజ్యోతి చెబితే బాగుండేది. జగన్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టి దానికి ప్రతిఫలంగ లాబాలు పొందారు నిమ్మగడ్డ. ఆ పెట్టుబడి పెట్టిన డబ్బు జగన్ అలగే పెట్టుకుంటే నిజంగానే నిమ్మగడ్డని అడ్డం పెట్టుకుని రసల్ ఖైమా సంస్థ ద్వారా జగన్ డబ్బు తెచ్చుకున్నారు అనుకొవచ్చు. అయితే ఇక్కడ ఆ డబ్బు మళ్ళి నిమ్మగడ్డ గారికి రెట్టిపు అయి వెళ్ళిపొయింది. మరి ఇక్కడ జగన్ చేసిన తప్పు ఎంటనేది ఆంద్ర జ్యోతి చెప్పాలి. అలాగే రసల్ ఖైమా సంస్థలో ఒప్పందం కుదరక ముందు నుండి పెట్టుబడులు పెట్టిన నిమ్మగడ్డ గారి డబ్బుని చూపి ఇది రసల్ ఖైమా సంస్థ డబ్బని ఎలా ఆంద్రజ్యోతి ఎలా నిర్ధారించిందో ఆంద్రజ్యోతే చెప్పాలి.
# ప్రజలు ఏమనుకుంటున్నారు..?
ఇలా మొదటి నుండి జగన్ పై ఏదో విధంగా బురదజల్లుతూ జగన్ పై వ్యతిరేకత తీసుకురావడాని ఆంద్రజ్యోతి నానా కుతంత్రాలు చేస్తూనే ఉంది. జగన్‌కు వ్యతిరేకంగా నిరాధారమైన.. ఊహాజనితమైన.. పసలేని పచ్చవార్తుల రాసి ప్రజలను తప్పుదోవ పట్టించడం ఆంద్రజ్యోతికి రోజువారి కార్యక్రమం అయిపోయింది. జగన్‌ను టార్గెట్ చేస్తూ ఎన్ని వ్యతిరేక కథనాలు రాసినా.. వాటిని నిరూపించడంలో మాత్రం విఫలమవుతూనే ఉంది. అయినా తమ స్వప్రయోజనాల కోసం చంద్రబాబు మెప్పు పోందడంకోసం జగన్ పై కుళ్ళు వార్తలు రాయం జ్యోతికి వెన్నతో పెట్టిన విధ్య. ఇక ఒక్కసారిగా బుధవారం జగన్ ప్యారడైజ్ లీక్స్ విషయంలో స్పందించి.. విదేశాల్లో తనకి డబ్బుందని నిరూపించడానికి.. చంద్రబాబుకు 15 రోజలు టైమ్ ఇవ్వడంతో ఒక్కసారిగా ఖంగుతిన్న ఎల్లో బ్యాచ్ వారు మరోసారి తప్పుడు కథనాలతో జగన్ గురించి ప్రజల్లో నెగిటీవ్ తీసుకురావడానికి పచ్చరాతల కార్యక్రమానికి పూనుకొంది. అయినా గతాన్ని చంద్రబాబు మర్చిపోవచ్చ..టీడీపీ శ్రేణులు మర్చిపోవచ్చు.. ఎల్లో మీడియా మర్చిపోవచ్చు.. ముఖ్యంగా ఆంద్రజ్యోతి మర్చిపోవచ్చు.. ప్రజలు మర్చిపోయే స్థితిలో లేరని.. వారి పచ్చ రాతలను నమ్మేస్థితిలో ఎవరూ లేరని ఒకసారి బుర్రకెక్కించుకుంటే మంచిందని ప్రజలు చర్చింకుంటున్నారు…!