ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర కనీవినీ ఎరుగని రీతిలో దుమ్మురేపుతోంది. జగన్ చేపట్టిన పాదయాత్ర పక్కా ప్రణాళికతో సాగుతోంది. ఆయన షెడ్యూల్ అన్ని వర్గాలను కలిసేలా పక్కాగా రూపొందించింది పీకే బృందం. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్ర పోయే వరకు జగన్ పాదయాత్ర తీరు చాలా విభిన్నంగా నడుస్తుంది.
ఇక మరోవైపు కార్యకర్తలతో సమావేశాలు, నేతలతో సమీక్షలు, పాదయాత్రలో ప్రజల సమస్యలు వింటూ సాయంత్రం రచ్చబండ తో నేరుగా ప్రజలతో ముఖా ముఖీ కార్యక్రమాలు సాగుతున్నాయి. ఇలా ఒక రోజులో మొత్తం అటు పార్టీ క్యాడర్‌తో ఇటు ప్రజలతో బహుముఖంగా కనెక్ట్ అవుతూ జగన్ అందరినీ ఆకర్షిస్తున్నారని.. జగన్ పాదయాత్ర రాజకీయ వర్గాలకు ఊహకందని విధంగా సాగుతోందని విశ్లేషకులు సైతం అభిప్రాయ పడుతున్నారు.