ప్రజాసంకల్పయాత్ర నాలుగో రోజు షెడ్యూల్ విడుదల అయింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం సాయంత్రం తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో యాత్ర షెడ్యూల్‌ను పోస్ట్ చేశారు. నాలుగో రోజు (గురువారం) వైఎస్ జగన్ …జమ్మలమడుగు నియోజకవర్గంలో 10.9 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. సర్వరాజుపేట, పెద్దనపాడు, వై.కోడూరు జంక్షన్‌లో భోజన విరామం, ఎర్రగుంట్ల, ప్రకాశ్ నగర్ కాలనీ మీదగా యాత్ర సాగుతుంది. ఎర్రగుంట్ల- ప్రొద్దుటూరు రోడ్డు క్యాంప్ సైట్‌లో ఆయన రాత్రి బస చేస్తారు.
#PrajaSankalpaYatra Day 4 Schedule pic.twitter.com/eVfCQfDNLs
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 8, 2017