ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ పాదయాత్రను అట్టహాసంగా ప్రారంబించారు. ఇక జగన్ పాదయాత్రకి మూడురోజులుగా జనంలో వస్తున్న స్పందన చూసి టీడీపీ వర్గీయులకు మింగుగు పడడంలేదు. ఇక మరోవైపు ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ కోడెల శివప్రసాదరావును కలిశారు.
ఇటీవల పార్టీ మారిన రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమెపై అనర్హత వేటు వేయాలని కోరారు. ఇటీవలే వైసీపీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. గతంలో పార్టీ మారిన 20 మంది ఎమ్మెల్యేలపై కూడా వేటు వేయాలని కోరిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఫిరాయించిన వైసీపీ ఎమ్మెల్యేల పై అనర్హత వేటు వేయని పక్షంలో అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోమనే విషయంపై ఫిర్యాదు చేసేందుకే స్పీకర్ను కలిశారని సమాచారం. దీంతో ఏపీ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలని రాజకీయ వర్గాల్లో ఆశక్తి నెలకొంది.