వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజా సంకల్ప యాత్రకు మద్దతుగా జనం జగన్ అడుగులో అడుగు వేస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి కూడా అభిమానులు తరలి వచ్చి పాదయాత్రలో పాల్గొంటున్నారు. పాదయాత్ర చేస్తున్న జగన్‌ను వృద్ధులు, మహిళలు, యువత కలిసి తమ కష్ట సుఖాలు చెప్పుకుంటున్నారు.
వృద్ధులైతే పింఛన్లు రావడం లేదని, యువత అయితే ఉద్యోగాలు రావడం లేదని, నిరుద్యోగ భృతి రావడం లేదని చంద్రబాబు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయలేదంటూ, అలాగే రైతులైతే పంటలు సరిగ్గా పండటం లేదని, పండిన పంటలకు సర్కారు గిట్టుబాటు ధర కల్పించడం లేదంటూ వారి వారి సమస్యలను జగనన్నకు చెప్పుకుంటున్నారు. ప్రజల సమస్యలు వింటూ.. కష్టాలు చూస్తూ.. జనానికి ధైర్యం చెబుతున్నారు జగన్. జనంతో మమేకమవుతూ.. వారి కష్టాలు వింటూ.. త్వరలోనే మంచి రోజులు వస్తాయని భరోసా ఇస్తూ జగన్ మోహన్‌రెడ్డి ముందుకు సాగుతున్నారు.
అంతేకాక వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి జనం వినతి పత్రాలు ఇస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను, అవి అమలు కాని తీరును వివరిస్తున్నారు ప్రజలు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పరిష్కరించాలని కోరారు. దారి పొడవునా వెంట వచ్చిన జనంతో ప్రజా సంకల్ప యాత్ర
జన సంద్రమైంది.
శ్రీశైలం నుంచి వచ్చిన దివ్యాంగ యువకుడు మాట్లాడుతూ.. నేను వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి వీరాభిమానిని, అలాగనే జగనన్నకు కూడా వీరాభిమానిని. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అమలు చేసిన పథకాలు కొనసాగాలంటే జగనన్నే సీఎం కావాలి.
అలాగే, ప్రజల కోసం జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్రకు తాము పూర్తిగా అండగా ఉంటామని. గుంటూరు నుంచి వచ్చిన అభిమానులు అన్నారు. రానున్న ఎన్నికల్లో జగనన్నను సీఎంగా ఎన్నుకుంటామన్నారు.