టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు, తమిళ అగ్రదర్శకుడు మురుగదాస్ కాంబినేషన్లో సినిమా అంటే.. అది ఎన్నో రికార్డులను తిరగరాస్తుందని ఆశించారు. అందుకు తగినట్టుగానే నిర్మాతలు ఆ సినిమా కోసం భారీగా ఖర్చుపెట్టారు. హీరో, దర్శకుడి రెమ్యునరేషన్లతో కలిపి ఆ సినిమా బడ్జెట్ మొత్తం రూ.150 కోట్లు దాటింది. విడుదలైన మొదటి షో నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకుని నిర్మాతలకు భారీ నష్టాలు మిగిల్చింది. తమిళంలో కాస్త పర్వాలేదనిపించింది.
తెలుగులో మాత్రం డిజాస్టర్‌గా నిలిచింది. ఎంతలా అంటే దక్షిణాదిలోనే ఇంతగా నష్టాలను మిగిల్చిన సినిమా ఇప్పటివరకు రాలేదట. దాదాపు 60 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చిందట. దక్షిణాది సినీ చరిత్రలో ఇదే అత్యంత భారీ డిజాస్టర్ అని టాక్ వస్తోంది. దేశం మొత్తంలో చూస్తే మాత్రం `స్పైడర్` కంటే ముందు `బాంబేవెల్వెట్` ఉందట. రణ్‌బీర్ కపూర్ హీరోగా వచ్చిన ఈ సినిమా వల్ల నిర్మాతలు దాదాపు 70 కోట్ల రూపాయలు నష్టపోయారట. అంటే దేశ చరిత్రలో రెండో అతిపెద్ద డిజాస్టర్‌గా స్పైడర్ నిలిచిందన్నమాట.