బాహుబలి సిరీస్ చిత్రాల తర్వాత డార్లింగ్ ప్రభాస్ చేస్తున్న చిత్రం సాహో. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కోసం వేట చాలా రోజులు జరిగింది. కన్నడ బ్యూటీ రష్మిక మందనా, బాలీవుడ్ హీరోయిన్స్ దీపికా పదుకునే, పరిణీతి చోప్రాలను సంప్రదించారు. అయితే వీరందరూ కాకుండా శ్రద్ధ కపూర్ కి ఈ అవకాశం వరించింది.
ఆషికి -2 చిత్రంలో శ్రద్ధ కపూర్ నటనను మెచ్చి డైరక్టర్ సుజీత్ ఈమెను సెలక్ట్ చేశారు. అంతేకాదు ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళంలో తెరకెక్కుతోంది కాబట్టి బాలీవుడ్ భామకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. శ్రద్ధాకి పారితోషికం కూడా బాగానే ఇచ్చిన్నట్లు సమాచారం. 9 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఒప్పందాలు జరిగాయని తెలిసింది.
హీరోయిన్ కే ఇంత మొత్తం ఇస్తుంటే ఇక బడ్జెట్ ఏ రేంజ్ లో ఉండబోతుందో ఇప్పటికే మీకు అర్ధమై ఉంటుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై 150 కోట్లతో వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ మూవీ దుబాయ్ షెడ్యూల్ కి సిద్ధమవుతోంది. అక్కడే ఆశ్చర్యకరమైన లొకేషన్లలో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్, ప్రభాస్ లపై భారీ యాక్షన్ సీన్ చిత్రీకరించనున్నారు. ఈ యాక్షన్ సీన్లో శ్రద్ధా కపూర్ కూడా విన్యాసాలు చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.