ప్రముఖ తెలుగు ఛానల్ లో ప్రసారమై ఒక కార్యక్రమంలోయాంకర్ గా రష్మీ తన అందాలను ఆరబోస్తూ సందడి చేస్తూ హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది .ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై అదే అందాలను మోతాదుకు మించి ఆరబోస్తూ గ్లామర్ డాల్ గా కుర్రకారును హుషారెత్తించడంలోను ఈ హాట్ యాంకర్ ముందుంటుంది.
తాజాగా ఈ బ్యూటీ అలీ టాక్ షో లో మాట్లాడుతూ .. తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించింది. “వైజాగ్ నుంచి ఒంటరిగా హైదరాబాద్ వచ్చిన నేను .. ఇక్కడ ఎన్నో కష్టాలు పడ్డాను. ఆ సమయంలో ఇంటినుంచి డబ్బులు తెప్పించుకోవడానికి నేను ఇష్టపడలేదు” అని తెల్పింది అమ్మడు .
అయితే “ఫస్టు చెక్ ను అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి అందుకున్నాను. ఆ డబ్బుతోనే ఇంటి అద్దె కట్టాను .. బ్యాంక్ ఎకౌంట్ ఓపెన్ చేశాను. ఇండస్ట్రీలో సక్సెస్ అయితే ఓకే .. లేదంటే ఇక్కడ సాయం చేసే వాళ్లు ఎవరూ వుండరు. కష్టాల్లో వున్నప్పుడు సాయం చేసేవారికన్నా .. ఆరా తీసే వాళ్లు ఎక్కువగా వుంటారు. ఇలాంటి పరిస్థితులు ఎదురుకావడం వల్లనే, నాకు డబ్బు విలువ తెలిసింది. అందువల్లనే నేను డబ్బుకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాను. పారితోషికం ఎక్కువ ఇస్తానంటే చిన్న హీరోతో చేయడానికి కూడా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు” అంటూ ఆమె అన్నది .