తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ,రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి మంత్రి కేటీఆర్ ఇవాళ మెట్రో ట్రెయిన్‌లో ప్రయాణించారు. ఎస్‌ఆర్ నగర్ నుంచి మియాపూర్‌కు మెట్రో రైలులో వచ్చారు. వీరి వెంట మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఉన్నారు. అనంతరం మియాపూర్ మెట్రో రైలు డిపోను మంత్రి కేటీఆర్, గవర్నర్ నరసింహన్ సందర్శించారు.మెట్రో ప్రాజెక్టు పనులను కూడా గవర్నర్ సమీక్షించారు. నవంబర్ 28వ తేదీన ప్రధాని మోదీ చేతుల మీదుగా మెట్రో రైలును ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ జర్నీలో చీఫ్ సెక్రటరీ ఎస్పీ సింగ్, మున్సిపల్ సెక్రటరీ నవిన్ మిట్టల్ కూడా ఉన్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్‌పెక్టర్ డీవీఎస్ రాజు సోమవారం రోజున మెట్రో పనులను సమీక్షించారు. బేగంపేట, ఎస్‌ఆర్ నగర్ మధ్య ఓవర్‌హెడ్ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టమ్ పనులను ఆయన ఆరా తీశారు. అమీర్‌పేట వద్ద ఓఈటీఎస్ పనులకు ఆయన ఆమోదం కూడా తెలిపారు. ఇవాళ బేంగపేట నుంచి అమీర్‌పేట మధ్య ట్రయల్ రన్ నిర్వహించారు.
Hon'ble Governor Sri ESL Narasimhan, Chief Secretary Sri SP Singh, Minister @KTRTRS took a test ride on Metro Rail from SR Nagar to Miyapur @hmrgov pic.twitter.com/wIlHl6mWm5
— Min IT, Telangana (@MinIT_Telangana) November 8, 2017
More glimpses from Metro Rail test ride by hon'ble Governor, Chief Secretary and Minister @KTRTRS today from SR Nagar to Miyapur @hmrgov pic.twitter.com/4LXbutS7T5
— Min IT, Telangana (@MinIT_Telangana) November 8, 2017