ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్రలో రెండో రోజు జగన్ ఇచ్చిన హామీకి ఓ వృద్ధురాలు షాక్‌కు గురికాగా, అక్కడున్న ప్రజలు అయోమయానికి లోనయ్యారంటూ చంద్రబాబు అనుకూల ఎల్లో మీడియా వారు.. పుల్కా వార్తలు వాడ్చి వడ్డిస్తున్నారు.
అసలు విషయం ఏంటంటే జగన్ చేపట్టిన పాదయాత్రలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఒక అవ్వ.. నాకు భర్త లేడు, పిల్లలు లేరు.. ఎవ్వరు లేరు,ఒంటరిదానిని ఇల్లు లేదు. ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం లేదని చెప్పగా.. జగన్ వెంటనే స్పందించి భయపడకు అవ్వా.. ఎవరూ లేని అవ్వా, తాతలకు ప్రతి మండల కేంద్రంలో వృద్ధాశ్రమం కట్టిస్తా అంతే కాదు అందులో డాక్టర్లు, నర్సులు ఉండేలా చేస్తానని చెప్పారు.
అయితే దీనికి కొంచెం సమయం పడుతుంది నీకు మరీ ఇబ్బందిగా ఉంటే పులివెందులలో మనదే వృద్ధాశ్రమం ఉంది.. ఎంపీ అవినాష్ కి చెప్తానని అక్కడికి వెళ్లి ఉండు అవ్వా అని జగన్ అన్నారు. అయితే మన టీడీపీ అనుకూల మీడియా వారు అవ్వకి షాక్ అంటూ దిక్కుమాలిన కథనాలు ప్రచురించాయి. దీంతో జగన్ ఏ కార్యక్రమాన్ని చేపట్టినా.. దాన్ని డైవర్ట్ చేయడానికి, తనపై బురద జల్లడం మామూలే అని.. ప్రజాసంకల్పం పాదయాత్రను మొదలు పెట్టిన నేపథ్యంలో తప్పుడు కథనాలు రాసి కాంట్రవర్సిటీలు క్రియేట్ చేయడానికి పచ్చ బ్యాచ్ వారు నానా తంటాలు పడుతున్నారని సోషల్ మీడియాలో సర్వత్రా చర్చించుకుంటున్నారు.