వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. అడుగుడగునా ప్రజలు జగన్ కు నీరాజనం పడుతున్నారు. జగన్ కూడా పాదయాత్ర చేస్తూ ప్రజాసమస్యలను వారిని అడిగి మరీ తెలుసుకుంటున్నారు. జగన్ పాదయాత్రలో రచ్చబండ కార్యక్రమం హైలెట్ గా చెప్పుకోవచ్చు. ప్రజలందరితో సమావేశమై వారి కి మైక్ అందించి వారి నుంచి ప్రశ్నలు జవాబులు రాబడుతూ తమ ప్రభుత్వం వచ్చాక ఏమి చేస్తానో ఎలా చేస్తానో వివరిస్తూ జగన్ ఆకట్టుకుంటున్నారు.
జగన్ చెప్పే ప్రతి జవాబుకి ఇచ్చే ప్రతి హామీకి జనం నుంచి భారీ రెస్పాన్స్ రావడం విశేషం. రైతులు , మహిళలు, విద్యార్థులు, వృద్ధులు, ఉద్యోగులు, అసంఘటిత రంగ కార్మికులు ఇలా అన్ని వర్గాలు విపక్ష నేత ముందుకు వచ్చి తమ బాధలను రచ్చబండ సాక్షిగా చెప్పుకుంటున్నాయి. ఇక మహానేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్మెంట్, వృద్దులు, వికలాంగులకు పెన్షన్లు, రెండు రూపాయల కిలో బియ్యం, ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ తో పేదల పాలిట పెన్నిధి అయ్యారు. ఇప్పుడు ఆయన వారసుడిగా అంతకు మించి కసిగా చేస్తా అంటున్న జగన్ మాటలు జనం లోకి బాగా పోతున్నాయని రాజకీయ వర్గీయులు చర్చించుకుంటున్నారు.