తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గీతారెడ్డి, జీవన్‌రెడ్డిపై భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావుఫైర్ అయ్యారు . ఇవాళ శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు సుమారు 15 నిమిషాలకు పైగా సమయం తీసుకుని.. సంబంధం లేకుండా ప్రశ్నలు వేయడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గీతారెడ్డి, జీవన్‌రెడ్డి కలిసి 15 నిమిషాలు ప్రశ్నలు వేస్తే.. మినిస్టర్ సమాధానం చెప్పేందుకు 30 నిమిషాల సమయం పడుతుందన్నారు. మళ్లీ బయటకు వెళ్లి అధికార పక్షం తమకు సమయం ఇవ్వడం లేదని కాంగ్రెస్ సభ్యులు చెప్పుకుంటున్నారని హరీష్‌రావు తెలిపారు. ప్రశ్న సూటిగా వేస్తే మంత్రి క్లుప్తంగా సమాధానం ఇస్తారని చెప్పారు. ఖమ్మం జిల్లాలో బోదకాలకు సంబంధించి మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడితే.. మీరేమో జహీరాబాద్, జగిత్యాల జిల్లాల్లో ప్రబలిన వ్యాధులపై ప్రస్తావిస్తున్నారు. ఇది సరికాదని మంత్రి హరీష్‌రావు సభ్యులకు సూచించారు.
