ఒకరేమో బంగారు తెలంగాణ నిర్మాణ రథ సారధి .మరొకరు ఆ రథ సారధి వెంట నడిచే సైనికుల్లో ఒకరు .ఇంతకు ఎవరు అనుకుంటున్నారా వారే తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ ,మరొకరు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు .ఇటు సీఎం కేసీఆర్ అటు మంత్రి హరీష్ రావు సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు .ఈ క్రమంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధి నిధులను ప్రతి ఏటా ప్రజాసంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నారు .
అందులో భాగంగా 2016-17 నిధులను విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు ఖర్చు చేస్తున్నారు .దీంతో ఇక్కడ గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ద్వారా కూడా ప్రత్యేక నిధులు ఖర్చు చేస్తున్నారు .ఇక 2015-16 లో మొత్తం డెబ్బై ఐదు లక్షల కేటాయించగా అందులో రూ 74 .35 లక్షలు ఖర్చు చేశారు .అయితే 2016-17 లో మూడు కోట్లు కేటాయించగా అందులో రూ 2 .69 కోట్లు ఖర్చు చేశారు .
2017 -18 ఏడాదిలో కూడా మూడు కోట్లు కేటాయించగా నియోజక వర్గంలో ఏ ఇంటిపై విద్యుత్ వైర్లు లేకుండా సరిదిద్దటానికి అంచనాలు తయారుచేశారు .మంత్రి హరీష్ రావు సిద్ధిపేట నియోజక వర్గంలో కమ్యూనిటీ హాళ్ళు ,పాఠశాలల భవనాలు ,ప్రహారిలు ,పల్లెల్లో డ్రైనేజీ ల నిర్మాణానికి ఖర్చు చేస్తున్నారు .2016-17 లో మొత్తం మూడు కోట్ల రూపాయలకు మొత్తం రూ 2.55 కోట్లు ఖర్చు చేశారు .ఇక 2017 -18లో రూ రెండు కోట్లకు ప్రతిపాదనలు పంపించారు .ఇలా నియోజక వర్గ అభివృద్ధి పనులకు ఖర్చు చేస్తున్నవారిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రథమ స్థానంలో ఉండగా ,మంత్రి హరీష్ రెండో స్థానంలో నిలిచారు .