మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో రెండు రోజుల కిత్రం దొంగతనం జరగడం సర్వత్రా చర్చ కు దారితీసిన సంగతి తెలిసిందే. ఎవరో బయటి వారు ఈ చోటికి పాల్పడలేదు.. చిరంజీవి ఇంట్లో గత పదేళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్న చెన్నయ్య అనే వ్యక్తి దొంగతనం చేయడం తో ఎవర్ని నమ్మాలో కూడా తెలియని పరిస్థితి లో మెగా ఫ్యామిలీ ఉంది. ఇక దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందుకు తీసుకొచ్చారు.
బోరబండ సమీపంలో నివసిస్తున్న కర్నూలు జిల్లాకు చెందిన చెన్నయ్య గత పదేళ్లు గా చిరు ఇంట్లో పనిచేస్తున్నాడు. ఇంట్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి..ఎవరెవరు వస్తుంటారు..మిగిలిన రహస్యాలన్నీ కూడా ఇతడికి బాగా తెలుసు. అతడి నుంచి రూ.1.5లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు పశ్చిమ మండలం ఏసీపీ శ్రీనివాస్ మీడియాకు వెల్లడించారు.
రెండు రోజుల క్రితం చిరంజీవి కార్యాలయంలోని అల్మరాలో అతని మేనేజర్ గంగాధర్ 4లక్షలు పెడుతుండగా చెన్నయ్య చూశాడని, ఎవరూ లేని సమయంలో ఆ మొత్తం నుంచి రూ.2లక్షలు చోరీ చేసి పోరిపోయాడని తెలిపారు. తాను ఉంచిన రూ.4లక్షల్లో రూ.2లక్షలు లేకపోవడంతో ఆందోళన చెందిన గంగాధర్ ఆ డబ్బును చెన్నయ్యే దొంగలించాడని అనుమానంతో జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదుచేసుకున్న పోలీసులు చెన్నయ్యను అరెస్టుచేసి విచారించడం తో చేసిన దొంగతనాన్ని బయటపెట్టాడు.