ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర గ్రాండ్‌గా స్టార్ట్ అయ్యింది. ఇదే క్రమంలో జగన్ పాదయాత్ర దిగ్విజయంగా మూడో రోజుకు చేరుకుంది. ఇక మూడోరోజు పాదయాత్రలో భాగంగా జగన్ ప్యారడైజ్ లీక్స్ పై స్పందించారు. తాను పాదయాత్ర స్టార్ట్ చేసిన రోజున కాంట్రవర్సిటీలు సృష్టించడానికి చంద్రబాబు అనుకూల మీడియావారు రెండు రోజులు సమయం వృధా చేశారని.. ఆ టైమ్ ఏందో ప్రజల సమస్యలను చూపించడానికి వినియోగిస్తే కాస్తైనా ఉపయోగం ఉండేదని మండిపడ్డారు.
అంతే కాంకుండా జగన్ చంద్రబాబుకు సవాల్ విసిరారు. జగన్‌కు విదేశాల్లో డబ్బులు దాచుకున్నాడని ప్యారడైజ్ లీక్స్ లో బయటపడ్డాయని చంద్రబాబు అనుకూల పచ్చ మీడియా వారు దిక్కుమాలిన కథనాలు వడ్డి వాడ్చారని.. నేనే చంద్రబాబును ఒకటే అడుగుతున్నానని.. చంద్రబాబుకు 15 రోజులు టైమ్ ఇస్తున్నా.. విదేశాల్లో పైసా ఉందని నిరూపిస్తే రాజకీయానుండి తప్పుకుంటా.. నిరూపించకపోతే చంద్రబాబు సీయం పదవి నుండి తప్పుకుంటారా..అంటూ జగన్.. చంద్రబాబుకు సవాల్ విసిరారు. దీంతో ఇప్పుడు జగన్ విసిరిన సవాల్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.