ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడో రోజు ‘ప్రజాసంకల్పయాత్ర’ను నేలతిమ్మాయిపల్లి నుంచి ప్రారంభించారు.అందులో భాగంగా ఈ రోజు ఉదయం 8.40 గంటలకు ఆయన మూడో రోజు పాదయాత్ర మొదలుపెట్టారు. ఈ క్రమంలో జగన్ వెంట నడిచేందుకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
వారందరినీ పలకరిస్తూ ఆయన ముందుకు సాగారు. నేలతిమ్మాయిపల్లిలో జెండాను వైఎస్ జగన్ ఆవిష్కరించారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు.అనంతరం విఎన్ పల్లి లో జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను ,ఎంపీలను రాజీనామా చేయించకుండా టీడీపీలో చేర్చుకున్నారు .
అంతే కాకుండా అందులో నలుగురుకి మంత్రి పదవులు ఇచ్చారు .పార్టీ మారడానికి ఒక్కొక్క ఎమ్మెల్యేకు ఇరవై కోట్లు ఇచ్చి మరి పార్టీలో చేర్చుకున్నారు అని జగన్ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు .