టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటు తన నటనతో అటు తన అందంతో సినిమా ప్రేక్షకులతో పాటుగా యువత మదిని పొలోమంటూ దోచేసిన కథానాయికలలో ఒకరు అనుపమ పరమేశ్వరన్ .ప్రేమమ్ .. అ ఆ .. శతమానం భవతి సినిమాలు ఆమె నటనకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాయి. లక్కీ హీరోయిన్ గా ఆమెకు పేరు తెచ్చిపెట్టాయి.
అలాంటి అనుపమ పరమేశ్వరన్ ‘ఉన్నది ఒకటే జిందగీ’ తోను ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా లో అమ్మడు నటనకి ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమాలో కథ మధ్యలోనే ఆమె పాత్ర చనిపోతుంది. ఈ సినిమా తరువాత ఆమెకి ఒక ఆఫర్ వచ్చింది. పెద్ద బ్యానర్లో .. స్టార్ డైరెక్టర్ తెరకెక్కించే సినిమా అది.
ముందు ఎగిరిగంతేసిన అనుపమ .. ఆ తరువాత కథ విని ఉసూరుమందట. ఈ సినిమాలోను మధ్యలోనే చనిపోయే పాత్ర కావడమే అందుకు కారణం. అందువల్లనే ఆమె .. వెంటనే అదే తరహా పాత్రను చేయలేనంటూ సున్నితంగా తిరస్కరించిందట. ఈ కారణంగా పెద్ద సినిమాను వదిలేసుకుందంటే .. దీంతో అనుపమ పక్కా ప్లానింగ్ తోనే ఉందనుకోవాలి మరి.