తెలంగాణ రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు జనగామ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి .ఈ వార్తలపై ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. ఈ రోజు బుధవారం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ‘పాలకుర్తి అసెంబ్లీ నియోజక వర్గం నుంచే పోటీ చేస్తా.. జనగామకు నేనెందుకు పోతా’ అని ఆయన బదులిచ్చారు . ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా.. ఓటు అడిగే హక్కు నాకుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. పాలకుర్తి నుంచే పోటీ చేసి 60వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తా అని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి కడియం శ్రీహరి పక్కా నిబంధనల ప్రకారం పని చేసే మనిషి, హానెస్ట్ పర్సన్ అని కితాబిచ్చారు. అందరం కలిసి జిల్లా అభివృద్ధి కోసం పని చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.
