Home / MOVIES / బ్ర‌హ్మాజీ మ‌జిల్స్‌పై ర‌ష్మీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

బ్ర‌హ్మాజీ మ‌జిల్స్‌పై ర‌ష్మీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

తెలుగులో యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టి అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయిన రష్మి…. అటు సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళ్తోంది. ఓ వైపు యాంకర్‌గా కొనసాగుతూనే సినిమాల్లో నటిగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది.బుల్లితెర‌పై యాంక‌రింగ్ చేస్తూ.. సినిమాల్లో కూడా న‌టించ‌డంపై కొంద‌రు త‌న‌ను ర‌క‌ర‌కాలుగా ప్ర‌శ్నిస్తున్నా.. నేనేదో చేయ‌కూడని త‌ప్పు చేస్తున్న‌ట్లు మాట్లాడుతున్నార‌ని, రెండు రంగాలు త‌కు ముఖ్య‌మైన‌వే అని ర‌ష్మి చెప్పిన విష‌యం తెలిసిందే.

టీవీ రంగంలోకి రాక‌ముందు తాను సినిమాల్లో ట్రై చేశాను. దాదాపు 14 సంవ‌త్స‌రాల‌పాటు నిల‌దొక్కుకునేందుకు పోరాడాను. నాకు అంతిమంగా బుల్లితెర రంగ‌మే బాగా గుర్తింపు తెచ్చింది. ఆ త‌ర్వాతే సినిమాల్లో అవ‌కాశాలు పెరిగాయ‌ని ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ర‌ష్మీ తెలిపిన విష‌యం విధిత‌మే.

ఇక న‌టుడు బ్రహ్మాజీ గురించి అంద‌రికీ తెలిసిందే. తెలుగులో సినిమాల‌లో విభిన్న పాత్రలను పోషిస్తూ తనదైన ప్రత్యోక నటశైలిని ఏర్పరుచుకున్నాడు బ్ర‌హ్మాజీ. సింధూరంతో హీరోగా పరిచయమైన బ్రహ్మాజీ ఆ చిత్రానికి ముందు ‘నిన్నేపెళ్ళాడతా’ చిత్రంలో ఆ తర్వాత ఖడ్గం, అతడు, ఏక్‌నిరంజన్‌, మిరపకారు, మర్యాద రామన్న వంటి పలు చిత్రాలలో విభిన్నమైన పాత్రలు పోషించి విలక్షణ నటుడుగా పేరు పొందాడు. అందేకాదు.. టాలీవుడ్‌లోని ప‌లువురు ప్ర‌ముఖ హీరీల‌తోనూ బ్ర‌హ్మాజీకి స‌న్నిహిత సంబంధాలు ఉన్న విష‌యం విధిత‌మే.
కాగా, ర‌ష్మీ తాజాగా ‘నెక్స్ట్ నువ్వే’ సినిమాలో న‌టించి త‌న‌ హాట్ లుక్స్ సినిమాకు ప్ల‌స్ అయ్యేలా చేసింది న‌ట‌న‌. ఈ సినిమాలో రష్మి చెప్పిన ఓ డైలాగ్ చర్చనీయాంశమైంది కూడాను. ‘‘నీకు గడ్డివాము దగ్గర కుక్క గురించి తెలుసా.. అది తినదు.. వేరే వాళ్లను తిననివ్వదు’’ అబ్బ.. నొప్పీ.. అంటుంది రష్మి ఈ సినిమాలో. ఈ సినిమాలో హీరోగా ఆది న‌టించ‌గా , హీరోయిన్‌గా వైభ‌వి శాండిల్య‌, బ్ర‌హ్మాజీ, ర‌ష్మీ, ఇత‌ర న‌టీన‌టులు ఉన్నారు.

అయితే, మొన్నీమధ్య జ‌రిగిన నెక్స్ట్ నువ్వే సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా చిత్ర యూనిట్ ప‌లు మీడియాల‌కు ఇంట‌ర్వ్యూలు ఇచ్చింది. ఈ సంద‌ర్భంగా చిత్రంపై ఆస‌క్తిని క‌లిగంచేందుకు చిత్ర బృందం ఇంట‌ర్వ్యూలో భాగంగా గేమ్‌ను ప్లాన్ చేశారు. గేమ్ ఆడే సంద‌ర్భంలో బ్ర‌హ్మాజీ వ‌య‌స్సుపై చ‌ర్చ మొద‌లైంది. ఈ క్ర‌మంలోనే మ‌ధ్య‌లో క‌లుగ‌జేసుకుని ర‌ష్మీ మాట్లాడుతూ.. బ్ర‌హ్మాజీ గారు ఇప్పకీ యూత్‌గానే ఉన్నారు. ఆయ‌న కండ‌ల‌ను చూశావా? అంటూ హీరోయిన్ వైభ‌వి శాండిల్య‌ను అడిగింది ర‌ష్మీ. దీంతో నాకు తెలీయ‌దంటూ శాండిల్య స‌మాధానం ఇవ్వ‌గా.. వెంట‌నే ర‌ష్మీ త‌న చేతిని బ్ర‌హ్మాజీ మ‌జిల్స్‌పై ఉంచి సో హాట్ అంటూ కితాబిచ్చింది.

ఇప్ప‌టికే ర‌ష్మీ, జ‌బ‌ర్ద‌స్త్ టీమ్ లీడ‌ర్ సుధీర్ మ‌ధ్య ఎఫైర్ ఉందంటూ వార్త‌లు గుప్ప‌మంటున్న నేప‌థ్యంలో తాజాగా బ్ర‌హ్మాజీపై ర‌ష్మీ చేసిన వ్యాఖ్య‌లు ఇంకెంత దుమారం రేపుతాయే మ‌రీ.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat