ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తోన్న వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు. విద్యుత్ ప్రాజెక్టులపై తెలంగాణ ముఖ్యమంత్రి గొప్పలు చెప్పుకుంటున్నారని, అవన్నీకాంగ్రెస్ పార్టీ పాలనలో నిర్మించినవేనని అన్నారు. ఈ రోజు హైదరాబాద్‌లోని తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ… దేశంలో అన్ని రాష్ట్రాల్లో మిగులు విద్యుత్ ఉందని, టీఆర్ఎస్ ప్రారంభించిన ప్రాజెక్టుల్లో మాత్రం కనీసం ఒక్క యూనిట్ విద్యుత్ కూడా ఉత్పత్తి కాలేదని చెప్పారు. రైతులపై ప్రేమ ఒలకబోస్తూ కేసీఆర్ చెబుతోన్న మాటలు మాత్రం చేతల్లో ఉండటం లేదని తెలిపారు. శాసనసభలో తాము ఇచ్చిన వాయిదా తీర్మానానికి స్పీకర్ అంగీకరించలేదని, అందుకే తాము సభ నుంచి వాకౌట్ చేశామని అన్నారు.
