తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది . 1261 పారామెడికల్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. స్టాఫ్ నర్సు -1115 పోస్టులు, వైద్య విధాన పరిషత్‌లో స్టాఫ్ నర్స్ -81, ఫిజియోథెరపిస్టు -6, రేడియో గ్రాఫర్ – 35, పారా మెడికల్ ఆఫీసర్స్ -2, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ ఆఫీసర్ – 1, ఉమెన్స్ డిగ్రీ కాలేజీల్లో హెల్త్ సూపర్ వైజర్లు -21 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఈ నెల 16 నుంచి వచ్చే నెల 11 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. జనవరిలో పరీక్ష, జోన్ల ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ ఉంటుందని టీఎస్‌పీఎస్సీ పేర్కొన్నది.