నందమూరి వారిది సైకిల్ గుర్తు కదా? మరి కళ్యాణ్ రామ్ స్పెషల్గా ఏమైనా పార్టీ పెడుతున్నాడా అని అనుకుంటున్నారా? అవును కళ్యాణ్ రామ్ పార్టీ పెట్టాడు. అయితే అది రియల్ లైఫ్లో కాదు రీల్ లైఫ్లో. ప్రస్తుతం ఈ హీరో ఉపేంద్ర మద్వానీ దర్శకత్వంలో ‘ఎంఎల్ఏ’ అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో సాగే కథ. ఈ మూవీ స్టోరీ డిమాండ్ చేయడంతో మనోడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేశాడు. వీరభద్రాపురం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ట్యాప్ గుర్తుకు ఓటేయమని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాడు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. సినిమాలో ప్రస్తుత రాజకీయాల ప్రస్తావన కూడా ఉంటుందని సమాచారం. రాజకీయాల్లో ఎత్తుగడలను కూడా కళ్ళకు కట్టినట్లుగా చూపించబోతున్నాడట దర్శకుడు. మొత్తానికి కళ్యాణ్ రామ్ ఓ పోలిటికల్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రానుండడం విశేషమనే చెప్పాలి. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని సమాచారం. కాజల్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని డిసెంబర్ లేదా వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల చేయాలని చూస్తున్నారు.