దక్షిణాది చిత్ర పరిశ్రమలో అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ దుమ్ము దులిపేస్తున్నది. నటనకు స్కోప్ ఉన్న పాత్రలకు ప్రాధాన్యం ఇస్తూనే తెర మీద గ్లామర్‌ను పండిస్తున్నది. రారండోయ్ వేడుక చూద్దాం, జయ జానకి నాయక, స్పైడర్ చిత్రాలు రకుల్ ప్రతిభకు అద్దం పట్టాయి. తాజాగా రకుల్ నటించిన ఖాకి. ఈ చిత్రం నవంబర్ 17న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదల చేసిన ప్రోమో సాంగ్ వీడియో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఎన్నో సినిమాలతో తమిళ ప్రేక్షకులనే కాకుండా తెలుగువారిని కూడా అలరించిన కార్తి ఈ సినిమాలో హీరోగా నటించారు. తెలుగు చిత్రాల్లో బబ్లీగానూ, పెర్ఫార్మర్‌గానూ పేరు తెచ్చుకున్న గ్లామర్ భామ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించారు.
ఖాకి చిత్రంలోని తొలి వయసే పాట వీడియోను ప్రమోషనల్ కార్యక్రమం కోసం విడుదల చేశారు. ఈ పాట ఇప్పటికే ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తున్నది. తొలి వయసే పాటలో రకుల్, కార్తీ కెమిస్ట్రీ అదిరిపోయింది. ఈ పాటలో ఇద్దరు హాట్ హాట్‌గా కనిపించింది. అదే మొత్తంలో కార్తీ కూడా విజృంభించాడు.
కార్తి, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో అభిమన్యు సింగ్, బోస్ వెంకట్, స్కార్లెట్ మెల్లిష్ విల్సన్ తదితరులు ఇతర తారాగణంగా నటించారు. ఈ చిత్రానికి కెమెరా: సత్యన్ సూరన్, సంగీతం: జిబ్రాన్, ఆర్ట్: కె. ఖదీర్, ఎడిటర్: శివనందీశ్వరన్, ఫైట్స్: దిలీప్ సుబ్బరాయన్, డ్యాన్స్: బృంద, నిర్మాతలు: ఉమేశ్ గుప్తా, సుభాష్ గుప్తా, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె.వి. శ్రీధర్ రెడ్డి.