ఏపీ అసెంబ్లీ సమావేశాలను శాశ్వతంగా బహిష్కరించింది ఏపీ ప్రతిపక్షపార్టీ వైసీపీ. వచ్చే నెల 8నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించి జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలను శాశ్వతంగా బహిష్కరించినట్లు వెల్లడించారు. ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోలేదని, అందుకే ఈ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు తెలిపాడు.
అయితే ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీని బహిష్కరించడం చరిత్రలో ఇదే తొలిసారి అని, ఆయన అనాలోచిత నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు అన్నారు. బుధవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన… అసెంబ్లీని వైసీపీ బహిష్కరించినా నిబంధనల ప్రకారమే నిర్వహిస్తామన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరుకావాలని సూచించారు. సభలో తనకు అన్ని పక్షాలు ఒక్కటేనన్నారు. ఎమ్మెల్యేల అనర్హత వేటుపై తన నిర్ణయం కోసం వేచి చూడకుండానే ప్రతిపక్ష నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారన్నారు.
